సైదాబాద్ ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని యువత కోరుతోంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచితే మహిళల పట్ల చిన్నారుల పట్ల అత్యాచార ఘటనలు జరగవని అభిప్రాయపడుతున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్లే మహిళల పట్ల అత్యాచారాలకు దారి తీస్తున్నాయంటున్నారు పాలమూరు, కరీంనగర్‌కు చెందిన పీజీ విద్యార్థులు.
అత్యాచారాల నియంత్రణకు ప్రభుత్వం చేసిన చట్టాలు అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. చదువు లేకపోవడం, చెడు వ్యసనాలకు బానిస కావడం, అశ్లీల చిత్రాలు చూడటం, మద్యం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం ఇలాంటివి మహిళల పట్ల అత్యాచారాలకు దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Saidabad Rape Case: కోట్ల మనసుల కోరిక తీరింది... కామాంధుడి కథ ముగిసింది..