ETV Bharat / state

జాయ్​రైడ్స్​లో యువత... రెండో రోజు ఉత్సాహంగా పోటీలు

మహబూబ్​నగర్ జిల్లాలో జాతీయ పారామోటార్ ఛాంపియన్ షిప్ పోటీలు రెండో రోజు కొనసాగాయి. నిర్వాహకులు నిర్వహించిన టాస్కుల్లో క్రీడాకారులు తమ ప్రతిభ చాటారు. జాయ్ రైడ్స్​లోనూ యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం పారామోటార్ ఎక్కి కొద్దిదూరం ప్రయాణించారు. గాలిలో తేలడం జీవితంలో మరచిపోలేని అనుభూతిని మిగిల్చిందని జాయ్ రైడ్స్​లో పాల్గొన్న యువత ఆనందం వ్యక్తం చేశారు.

జాయ్​రైడ్స్​లో యువత... రెండో రోజు ఉత్సాహంగా పోటీలు
జాయ్​రైడ్స్​లో యువత... రెండో రోజు ఉత్సాహంగా పోటీలు
author img

By

Published : Jan 14, 2021, 7:22 PM IST

జాయ్​రైడ్స్​లో యువత... రెండో రోజు ఉత్సాహంగా పోటీలు

మహబూబ్​నగర్ స్టేడియం గ్రౌండ్ వేదికగా జాతీయ పారామోటర్ ఛాంపియన్ షిప్ పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు టాస్కుకు సంబంధించి రెండు విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. టేకాఫై జడ్జీలు నిర్ణయించిన ప్రదేశంలో సురక్షితంగా ల్యాండ్ కావడం టాస్క్.

లక్షిత ప్రదేశానికి ఎంత దగ్గరగా ల్యాండ్ అయితే అన్ని ఎక్కువ పాయింట్లు కేటాయిస్తారు. లక్షిత ప్రదేశానికి దూరంగా ల్యాండ్ అయితే వారికి తక్కువ పాయింట్లిస్తారు. రెండో రోజు ఈ టాస్కును క్రీడాకారులు పూర్తి చేశారు. పారామోటార్​ను టేకాఫ్ చేసే క్రమంలో ఓ క్రీడాకారుడి మోటార్ పక్కకు ఒరిగి స్వల్పంగా గాయపడ్డారు.

జాయ్​రైడ్స్...

టాస్కులు ముగిసిన తర్వాత జాయ్ రైడ్స్ సైతం చేపట్టారు. మహబూబ్​నగర్​తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు పోటీలను ఆసక్తిగా తిలకించారు. కొందరు రుసుములు చెల్లించి జాయ్ రైడ్స్​లో సైతం పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రీడాకారులను ఉత్సాహ పరించేందుకు పారామోటార్​లో నేలపై కొద్ది దూరం ప్రయాణించారు. జాతీయ స్థాయి క్రీడలకు పాలమూరు వేదిక కావడం సంతోషంగా ఉందన్న ఆయన... భవిషత్తులో కోయిల్​సాగర్, సోమశిల, ఉదండాపూర్​, కర్వెన రిజర్వాయర్ల వద్ద ఈ తరహా పోటీలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.

మంచి అనుభూతి...

జాయ్ రైడ్స్​లో పాల్గొన్న యువత, విద్యార్థులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. గాలిలో ఎగిరే అనుభవం మంచి అనుభూతినిచ్చిందని పైనుంచి చూస్తే కింది ప్రదేశాలు అందంగా కనిపించాయని చెప్పారు. ఇలాంటి క్రీడల్ని మరింత ప్రోత్సహించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అంతరాయం...

సెలవులు, పండుగ కావడం వల్ల పారామోటార్ ఛాంపియన్ షిప్ గురించి తెలుసుకుని చాలా మంది స్టేడియం గ్రౌండ్ వద్దకు తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకే జాయ్ రైడ్స్ నిర్వహించి నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన జనం జాయ్ రైడ్స్ లేకపోవడం వల్ల నిరాశతో వెనుదిరిగారు. సాయంత్రం సైతం ఎక్కువమంది జనం రాగా జాయ్ రైడ్స్​కు అంతరాయం కలిగింది.

ఇదీ చూడండి: 'జాతీయ క్రీడలకు చిరునామాగా.. పాలమూరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.