అంతర్జాలంలో యువతుల ఫొటోలు పెట్టి విటులను ఆకర్షిస్తూ.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ.శివకుమార్ (27) దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ... ప్రైవేటు వ్యాపారం చేస్తున్నాడు. తన మిత్రుడు చిన్నాతో కలిసి ఏడాది క్రితం అంతర్జాలం ద్వారా వ్యభిచార కార్యకలాపాలు ప్రారంభించాడు.
బెంగాల్, ముంబయి నుంచి వ్యభిచార నిర్వాహకుల ద్వారా యువతులను కాంట్రాక్టు పద్ధతిలో హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఆ అమ్మాయిల ఫొటోలు అంతర్జాలంలో పెట్టి విటులను ఆకర్షిస్తూ... డబ్బు సంపాదిస్తున్నారు. వీరి కార్యకలాపాలను పసిగట్టిన మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు... నేరేడ్‌మెట్ వాయుపురిలో దాడులు నిర్వహించారు. శివకుమార్‌తోపాటు మరో ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. వారిని నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు.