మహబూబ్నగర్ జిల్లాలో.. ప్రసిద్ధి చెందిన సంతల్లో దేవరకద్ర పశువుల సంత ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ పశువులను కొనేందుకు.. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. వారితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి రైతులు క్రయవిక్రయాలు చేసేందుకు.. ఆసక్తి చూపుతుంటారు. ఈసంత నిర్వహణతో పశువులను రవాణా చేసే వాహనాలతో పాటు.. అనుబంధ అవసరాలను తీర్చే.. హోటళ్లు, టీ కొట్లు, సోడా లెమన్, ఇతర తినుబండారాలను విక్రయిస్తూ కొన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నాాయి.
పశువుల అలంకరణ వస్తువులు, గొర్రెల రక్షణకు అవసరమైన వలలతో పాటు.. వివిధ రకాల సామగ్రిని ఇక్కడ విక్రయిస్తుంటారు. ఇలా ఈసంత వందల మందికి జీవనోపాధి కల్పిస్తూ వారి కుటుంబ పోషణకు తోడ్పడుతుంది. దేవరకద్రలోని పశువుల సంత వల్ల గ్రామ పంచాయతీకి ఏటా 50 లక్షలకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తూ సుమారు ఐదు వందల కుటుంబాలు.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి పొందటం గమనార్హం. లాక్‌డౌన్ సడలింపుతో ఈ కుటుంబాల్లో.. తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి.
ఇదీ చూడండి: 'రుణాల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు'