ETV Bharat / state

డిసెంబర్ 10 నుంచి కోయిల్ సాగర్ నీటి విడుదల - కోయిల్​ సాగర్​ లేెటెస్ట్​ వార్తలు

కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగికి కుడి, ఎడమ కాలువలకు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మార్చి మొదటి వారం వరకు సాగునీటిని విడుదల చేయాలని కోయిల్ సాగర్ ఆయకట్టుదారుల సమన్వయ కమిటీ సమావేశం తీర్మానించింది. మహబూబ్​నగర్​లో ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

water release from koil sagar on december 10th to march 2021
డిసెంబర్ 10 నుంచి కోయిల్ సాగర్ నీటి విడుదల
author img

By

Published : Dec 8, 2020, 7:17 AM IST

మహబూబ్​నగర్​లో సోమవారం.. ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అధ్యక్షతన కోయిల్ సాగర్ ఆయకట్టుదారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నుంచి యాసంగికి కుడి, ఎడమ కాలువలకు డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది మార్చి మొదటి వారం వరకు సాగునీటిని విడుదల చేయాలని సమావేశం తీర్మానించింది. ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ కోసం 38 కోట్లు మంజూరు చేశారని, కాలువల పూడికతీత, కంప చెట్లు తొలగింపు, లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

డిసెంబర్ 10 నుంచి మార్చి మొదటి వారం వరకు సాగునీరు అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతులు అందుకు ఏకగ్రీవంగా ఆమోదించారని తెలిపారు. యాసంగి పంట పూర్తయిన వెంటనే ప్రాజెక్టు కాలువలకు మరమ్మతులు చేపట్టేందుకు ఇంజినీర్లు చర్యలు తీసుకోవాలని, ఫిబ్రవరి నాటికి కావాల్సిన మెటీరియల్ సేకరించాలని మంత్రి సూచించారు. అలాగే సాగునీరు ఉన్నప్పుడు కూడా పనులు చేసేందుకు ఏవైనా అవకాశం ఉంటే పనులు చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించాలని కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఇంజినీర్లను ఆదేశించారు. భవిష్యత్తులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కూడా కోయిల్ సాగర్ ప్రాజెక్టును నింపాలనే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడనని... ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు.

కోయిల్ సాగర్ ఎత్తును పెంచాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కోరారు. ఎత్తు పెంచడం వల్ల మరో ఐదు గ్రామాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో తగినంత నీరు ఉన్నందున, మిషన్ భగీరథ తాగునీటిని ఇచ్చేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని, యాసంగికి పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

డిసెంబర్ 10 నుంచి కోయిల్ సాగర్ నీటి విడుదల

ఇదీ చదవండి: ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.