ETV Bharat / state

ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో  ఓటు అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
author img

By

Published : Apr 8, 2019, 8:32 PM IST

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు అత్యంత ప్రాధాన్యం ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్​ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సరైన నాయకుడిని ఎన్నుకోండి

గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్టణ వాసులు, చదువుకున్నవారు ఓటేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతరంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. చదువుకున్న వారంతా విధిగా తమ తమ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నిజాయతీ కలిగిన నాయకుడిని ఎన్నుకుంటే సమస్యలు వేగంగా తీరుతాయన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం

ఇదీ చదవండి: ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: ప్రశాంత్​ రెడ్డి

Intro:TG_Mbnr_12_08_Eenadu_Etv_Avagahana_sadassu_AB_C4

( ) ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వినియోగం అత్యంత ప్రాధాన్యం ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే చదువుకున్నవారు ఓటు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యార్థులు పాల్గొన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోవాలని.. ప్రస్తుత నాయకుడు బాగాలేదని మాట్లాడేవారు ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.

Body:ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, లొంగకుండా ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవాలని విద్యార్థులు కోరారు. గ్రామాల్లో సైతం బాధ్యతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని... ప్రతి ఒక్కరు ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని అన్నారు. అప్పుడే నిజాయితీ కలిగిన నాయకుడు రావడంతో పాటు.. సమస్యలు పరిష్కారం వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు.

Conclusion:బైట్స్
విద్యార్థులు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.