ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు శాసనసభ్యులు పరామర్శించారు. ఇటీవలే శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతి చెందారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ గౌడ్ స్వగృహానికి చేరుకుని నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శాసనసభ్యులు మాగంటి గోపినాథ్, క్రాంతి, కృష్ణారావు, రాజేందర్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర స్థాయినేతలు మంత్రిని పరామర్శించిన వారిలో ఉన్నారు.
![vips met with minister srinivas goud in mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10710784_sd.jpg)
ఇదీ చదవండి: కరోనా కేసులపై గవర్నర్ ఆందోళన