మహబూబ్‌నగర్ జిల్లా మిడ్డిల్ మండలం తండాకు చెందిన రవినాయక్(20) హైదరాబాద్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. కాళీ సమయాల్లో పెళ్లిళ్లకు ఫొటోలు, వీడియోలు తీయడానికి వెళ్తుంటాడు. జడ్చర్ల మండలంలోని చిన్న ఆదిరాల పంచాయతీలోని తూర్పుగడ్డ తండాలో జరుగుతున్న వివాహానికి ఫొటోలు తీసేందుకు రవినాయక్ వెళ్లాడు.
ఫొటోలు, వీడియోల కోసం లైటింగ్ పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగలగా అక్కడికక్కడే మృతి చెందాడు. వివాహం జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ ఘటన జరగటం వల్ల పెళ్లింట విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.