ETV Bharat / state

ఎక్సైజ్ శాఖ మంత్రిపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు

ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్​పై రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

victims complained on minister srinivas goud in hrc in hyderabad
ఎక్సైజ్ శాఖ మంత్రిపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు
author img

By

Published : Mar 1, 2021, 6:12 PM IST

మహబూబ్​నగర్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అవినీతి కార్యకలాపాలపై హైకోర్టులో పిటిషన్ వేసినందుకు... తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి ఆరోపించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అవినీతి కార్యకలాపాలు, అతని సోదరుడి భూకబ్జాలపై ఎవరు ప్రశ్నించినా.. వారిపై అక్రమ కేసులు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. గత నెల 21న తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. తనకు ప్రాణ రక్షణ కల్పించి.. మంత్రి, అతని సోదరుడు, మహబూబ్​నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఎక్సైజ్ శాఖ మంత్రిపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు

ఇదీ చదవండి: గిఫ్ట్ కార్డుల పేరుతో మోసం.. ఝార్కండ్ ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.