మహబూబ్నగర్ జిల్లాలో మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన కార్మికులు.. అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు లేకుండా.. త్రిసభ్య కమిటీతో సమావేశమై ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటీకరించి ఆస్తులను ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్, సీపీఎం ప్రజా సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘం మద్దతు పలికింది. ఉపాధ్యాయ సంఘం ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం పలికింది.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి