మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మొనప్పగుట్టలోని అయ్యప్పమాలధారులకు పట్టణానికి చెందిన పలువురు ముస్లిం సోదరులు అల్పహారం ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటారు. ఎంతో కఠోరమైన అయ్యప్ప దీక్ష చేస్తున్న భక్తులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అభిప్రాయపడ్డారు. కుల మతాలు వేరైనా మానవత్వంతో సమభావనతో మెలగాలని కోరారు. అందులో భాగంగా అయ్యప్ప స్వాములకు అల్పహారం అందించడమే కాకుండా వారితో పాటు కలసి భూజించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఇవీచూడండి: వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి... వృథాగా పోతున్న నీరు