ETV Bharat / state

జన అదాలత్​లో తొలి రోజు 6 కేసుల విచారణ - mahabubnagar diatrict latest news

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్వహించిన జన అదాలత్​లో మొదటి రోజు 6 కేసులను విచారించారు. ఈ సందర్భంగా ఒక కేసుకు సంబంధించి సమగ్ర విచారణ నిర్వహించి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

The first day in the Jana Adalat was the hearing of 6 cases in mahabubnagar
జన అదాలత్​లో తొలి రోజు 6 కేసుల విచారణ
author img

By

Published : Dec 10, 2020, 5:35 AM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్వహించిన జన అదాలత్​లో మొదటి రోజు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులంబ గద్వాల జిల్లాలకు సంబంధించి ఆరు కేసులను విచారించారు. కమిషన్ చొరవతో నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి జ్యోతిశ్వరి భూమికి సంబంధించిన కేసును పరిష్కరించారు. ఒక కేసుకు సంబంధించి సమగ్ర విచారణ నిర్వహించి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

మరో కేసులో అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఎస్సీ, ఎస్టీ చట్టాలను ఉల్లంఘించి ఇబ్బందులకు గురి చేసినట్లయితే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయాలని, కమిషన్ ద్వారా ఆయా కేసుల విషయమై నోటీసులు జారీ చేసినప్పుడు వాటికి తక్షణమే స్పందించి నివేదికలు సమర్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు బి.విద్యాసాగర్, నీలాదేవి, చిలకమర్రి నరసింహ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి పాండా దాస్​తో పాటు అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో కె.స్వర్ణలత, ఆయా కేసులకు సంబంధించి ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, తహసీల్దార్లు హాజరయ్యారు.

ఇదీ చూడండి: 'న్యాయం చేయకుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.