ETV Bharat / state

'బడ్జెట్​లో మహబూబ్ నగర్​ జిల్లాకు ఒరిగిందేమీ లేదు' - తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రావు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్ వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు.

kothhakota dayakar reddy
'బడ్జెట్​ వల్ల మహబూబ్ నగర్​ జిల్లాకు ఒరిగిందేమీ లేదు'
author img

By

Published : Mar 11, 2020, 10:49 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్ వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్​లో ప్రతిపాదించిన 380 కోట్లు ఏ మూలకు సరిపోతాయని, ఇలాగైతే ఎప్పుడు పాలమూరు-రంగారెడ్డి పథకం పూర్తవుతుందని మండిపడ్డారు. నారాయణపేట-మక్తల్-కొండగల్ ఎత్తిపోతల పథకాన్ని తుంగలో తొక్కి పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీళ్లిస్తామని బీరాలు పలికిన శాసనసభ్యులు ఎప్పటిలోపు నీళ్లిస్తారో చెప్పాలని నిలదీశారు.

ముఖ్యమంత్రి ప్రకటించిన గట్టు ఎత్తిపోతల పథకం ప్రస్తావన ఏదని దయాకర్​ రెడ్డి ఎద్దేవా చేశారు. రెండు పడక గదుల ఇళ్లు ఎప్పుడిస్తారని, కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూ పంపిణి ఏమైందన్నారు. పత్తి, కంది రైతులు పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతుంటే రైతు సమన్వయ సమితి సభ్యులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోవడం లేదని.. అవసరమైతే కోర్టును ఆశ్రయించైనా ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

'బడ్జెట్​ వల్ల మహబూబ్ నగర్​ జిల్లాకు ఒరిగిందేమీ లేదు'

ఇవీ చూడండి: శిరస్త్రాణం​ ధరించకుంటే క్లిక్​మనిపిస్తారు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.