న్యాయవాద రక్షణ చట్టం తెచ్చే వరకు పోరాడుతామని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్లో.. నిర్వహించిన న్యాయవాదుల సన్నాహాక సమావేశంలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింహరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ ఈ నెల 9న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ప్రకటించింది. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఇప్పటికే అన్ని బార్ అసోసియేషన్‌ల ముందు రిలే నిరహార దీక్షలు చేపట్టారు.
సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే.. వారి తరపున పోరాడి న్యాయం చేసేంతవరకు వాళ్ల వెన్నంటే ఉండే న్యాయవాదులకు... రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి : 50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు ఫోన్ కాల్