మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని శివాజీ నగర్లో నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న ఓఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు లక్షా 50 వేల రూపాయల విలువైన గుట్కాలను సీజ్ చేశారు.
వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో వైష్ణవి కిరాణం దుకాణంలో 20 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. వ్యాపారి మహేశ్‌తోపాటు, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గుట్కా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్ కేసులు