పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సవరించిన అంచనాలను సవాల్ చేస్తూ నాగం జనార్దన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సవరించిన అంచనాలతో ప్రాజెక్టు వ్యయం పెంచారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. కాంట్రాక్టు తీసుకున్న సంస్థలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయని కోర్టుకు తెలిపారు. ఐటీ వాళ్లను కూడా పార్టీ చేయాలని కోరారు. లేదంటే ఐటీ ద్వారా సమాచారం సీబీఐ తీసుకొని విచారణ జరపాలన్నారు.
ఐటీని చేర్చాల్సిన అవసరం లేదు
ఐటీ పత్రికా ప్రకటనలో తమ సంస్థ పేర్లు లేవని తెలిపిన మెఘా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఐటీని కేసులో చేర్చాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే కేసు విచారణకు సీబీఐ సహాయం తీసుకొవ్చని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ జనవరి 14 కు వాయిదా వేసింది.