ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కళాశాల విద్యార్థులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, ఉపకారవేతనాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ర్యాలీగా తెలంగాణ కూడలి వరకు వెళ్లి అక్కడ బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని కోరారు.
ఇవీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు