ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో పాలమూరు జిల్లా విద్యార్థిని ప్రతిభ కనబరిచింది. జడ్చర్లకు చెందిన హరిచందన అనే విద్యార్థిని ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించింది. ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో విద్యనభ్యసించినట్లు వెల్లడించింది. ఇదే పట్టుదలతో సివిల్స్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులు రాజేశ్వర్ రెడ్డి, లక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. కుమార్తెకు రాష్ట్రస్థాయిలో ర్యాంక్ రావటం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన జడ్చర్ల విద్యార్థిని - తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మెరిసిన హరిచందన
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన విద్యార్థిని హరిచందన 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిర్చారు. ఇదే పట్టుదలతో సివిల్స్ సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.