ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 7,19,134 హెక్టార్లు అయినప్పటికీ ఈసారి 8,19,632 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకానున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈసాగు విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, పత్తిలదే అగ్రస్థానం. ఇందులో మొక్కజొన్న, వరి పంటలను చాలా వరకు తగ్గించాలని అధికారులకు సూచనలు వచ్చాయి. వాటికి ప్రత్యామ్నాయంగా కంది, పత్తి పంటల సాగు పెరిగేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు.
డీలర్లు, ఏజెన్సీలతో.. ప్రత్యేక సమావేశం
మొక్కజొన్న విత్తనాల విక్రయాల డీలర్లు, ఏజెన్సీలతో రెండు, మూడు రోజుల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మొక్కజొన్న విత్తనాల విక్రయాలపై ఆంక్షలను విధించనున్నారు.
ఊపందుకోనున్న వ్యాపారాలు
లాక్‌డౌన్ నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం వల్ల వ్యాపారాలు ఊపందుకోనున్నాయి. దాదాపు రెండు నెలలుగా మూతపడిన వ్యాపార సంస్థలు, దుకాణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల వల్ల తెరుచుకోనున్నాయి.
ఇదీ చూడండి: కాళేశ్వరంపై ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు..