సాధ్యమైనంత వరకు చరవాణిని తక్కువగా వినియోగించాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి సూచించారు. ప్రస్తుతం యువత సెల్ఫోన్ చూస్తూ అత్యంత విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో జరిగిన క్లస్టర్ స్థాయి సాహిత్య విభాగం పోటీలను ఆయన ప్రారంభించారు. పుస్తకాలు, నవలను చదవాలని, కష్టనష్టాల గురించి తెలుసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాయడం, మాట్లాడటంలో అనేక పొరపాట్లు దొర్లడం ఆందోళన కలిగిస్తుందన్నారు.
మాతృభాషను పరిరక్షించుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అభిప్రాయపడ్డారు.