ETV Bharat / state

ఎస్సీ రుణాల పంపిణీకి మార్గం సుగమం

గత కొంత కాలంగా ఎన్నికల కోడ్​ వల్ల నిలిచిపోయిన ఎస్సీ రుణాల పంపిణీకి మార్గం సుగమమైంది. జూలై 10 లోగా అర్హత జాబితాను రూపొందించాలని సంబంధిత అధికారులకు ఉన్నాతాధికారులు ఆదేశాలిచ్చారు.

ఎస్సీ రుణాల మంజూరుపై సమీక్ష
author img

By

Published : Jun 27, 2019, 4:27 PM IST

ఎట్టకేలకు ఎస్సీ రుణాలకు గ్రహణం వీడింది. 2018-19 ఏడాదికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ప్రక్రియ 8 నెలలుగా ఎన్నికల కోడ్‌ వల్ల నిలిచిపోయింది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికలు పూర్తి చేయాల్సి ఉండగా పూర్తి కాలేదు. 2017-18 ఏడాదికి సంబంధించిన రుణాల వ్యవహారమే ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో నడుస్తోంది. ఈ సమయంలో కలెక్టర్‌ 2018-19 రుణాల మంజూరు ప్రక్రియకు అనుమతి ఇచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అన్ని మండలాల ఎంపీడీవోలకు రాయితీ రుణాలకు అర్హత కలిగిన వారి జాబితాను ఎంపిక చేసే విధివిధానాల ఉత్తర్వులను పంపుతున్నారు. వచ్చే నెల 10వ లోగా అర్హత కలిగిన వారికి ఎంపిక చేసి తుది జాబితాను ఎస్సీ కార్పొరేషన్‌కు అందించాల్సి ఉంది.

రాయితీ రుణాల కోసం ఎస్సీ కార్పొరేషన్‌కు 3,824 మంది అంతర్జాలంలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈసారి ఇచ్చే రుణాలను రెండు విధాలుగా పంపిణీ చేయనున్నారు. అందులో వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి, నైపుణ్యం లేనివారికి సమానంగా రాయితీ రుణాలను అందిస్తున్నారు. నైపుణ్యం లేనివారిని ఆయా మండలాల్లో ఎంపీడీవోలు ఎంపిక చేస్తారు. నైపుణ్యమున్న వారిని ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారులు ఎంపిక చేస్తారు. ఎస్సీ జనాభా ప్రాతిపదికన ఈ యూనిట్లను నిర్ధరించారు. జిల్లావ్యాప్తంగా 14 మండలాలు, 3 పురపాలికల్లో 1,25,730 మంది ఎస్సీలు ఉన్నారు. అందులో నైపుణ్యమున్నవారికి రూ.2.21 కోట్లు, నైపుణ్యం లేనివారికి రూ.2.21 కోట్లు కేటాయించారు. వచ్చిన రాయితీ నిధులను 50 శాతం చొప్పున విభజించారు.

మహిళలకు 33శాతం కేటాయింపు ..

2018-19 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు మంజూరైన రాయితీ నిధుల్లో 33 శాతం మహిళలకు కేటాయించారు. నైపుణ్యం ఉన్నవారు, నైపుణ్యం లేనివారిలో మూడోవంతు నిధులను ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులకు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులకు 3 శాతం చొప్పున నిధులను కేటాయించారు. తొలిసారిగా ఈ నూతన విధానానికి సర్కార్‌ ప్రాధాన్యం ఇచ్చింది. రూ.లక్ష విలువ కలిగిన యూనిట్‌కు 80 శాతం రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. బ్యాంకర్లు 20 శాతం రుణాన్ని అందిస్తారు. రూ.2 లక్షలకు 70 శాతం రాయితీ, రూ.5 లక్షలకు 60 శాతం రాయితీ ఉంటుంది. అంతేకాకుండా రూ.12లక్షల వరకు రుణం తీసుకున్నా అందులో రూ.5 లక్షల వరకే రాయితీ వర్తిస్తుంది.

యూనిట్లతో సంబంధం ఉండదు ..

ప్రతి మండలానికి యూనిట్లతో సంబంధం లేకుండా రాయితీ నిధులను పంపిణీ చేశారు. ఆ మండలంలో నివసిస్తున్న ఎస్సీ జనాభా ప్రాతిపదికగా రాయితీ నిధులను మంజూరు చేశారు. ఉదాహరణకు అడ్డాకుల మండలంలో 4,310 మంది ఎస్సీ జనాభా ఉంది. ఈ మండలంలో 71 మంది స్కిల్డ్‌, 94 మంది అన్‌స్కిల్డ్‌ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ మండలానికి రూ.15.20 లక్షల రాయితీ నిధులను కేటాయించారు. ఇప్పుడు 94 మంది అన్‌స్కిల్డ్‌ దరఖాస్తులను మాత్రమే ఎంపీడీవో పర్యవేక్షించాలి. వారికి మాత్రమే ఈ రాయితీ డబ్బును పంపిణీ చేయాలి. మండలంలో ఎంపీడీవో, బ్యాంకు మేనేజర్‌, ఈవోపీఆర్డీ, ఎంఎంఎస్‌ అధ్యక్షురాలితో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. వారే అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయాలి. నైపుణ్య విభాగంలో వచ్చిన దరఖాస్తులు ఎస్సీ కార్పొరేషన్‌కు పంపించాలి. జిల్లా అధికారులు మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు..

నైపుణ్యం లేని కేటగిరీ కింద గేదెల కొనుగోళ్లు, పాల వ్యాపారం, బేకరీ, మిఠాయిల దుకాణం, పూల వ్యాపారం, హోటల్‌, పుస్తకాల దుకాణం, ఇటుకల తయారీ, హార్డ్‌ వేర్‌, ఎద్దుల బండ్లు, కేబుల్‌ టీవీ, చరవాణి దుకాణం, సిమెంట్‌ వ్యాపారం, సెంట్రింగ్‌, చికెన్‌, మటన్‌ దుకాణం, సైకిల్‌ దుకాణం, అంతర్జాల కేంద్రం, మెడికల్‌ దుకాణం, నీటి ప్లాంట్‌, మినీ సూపర్‌ బజార్లు తదితర రంగాల్లో ఉపాధిని కల్పించడానికి రాయితీ నిధులను పంపిణీ చేస్తారు.

నైపుణ్యం ఉన్నవారికి..

పట్టు పురుగుల పరిశ్రమ, హార్వెస్టర్‌, విత్తన మార్పిడి, కారం పొడి పరిశ్రమ, వర్మి కంపోస్టు, కూరగాయల సాగు, ఆటోమొబైల్‌ సర్వీసింగ్‌ సెంటర్‌, చరవాణి మరమ్మతు, రంగుల తయారీ, ఎలక్ట్రికల్‌ దుకాణం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, స్వగృహ తిను బండారాలు, కుట్టు మిషన్‌, వెల్డింగ్‌ దుకాణం వంటి రంగాల్లో వీరికి రుణాలను అందిస్తారు.

సకాలంలోనే రుణ ప్రక్రియను పూర్తిచేస్తాం

జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీల్లో అర్హత కలిగిన వారికి రాయితీ రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిర్ణీత గడువులోగానే ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇప్పటికే ఎంపీడీవోలు, పురపాలిక కమిషనర్లకు తగిన సూచనలను ఇచ్చాం. వారంతా వారి ప్రాంతాల్లో దరఖాస్తులు చేసిన నైపుణ్యం లేని వారికి రాయితీ రుణాలను అందించడానికి కృషి చేయాలి. మా కార్యాలయంలో నైపుణ్యం ఉన్నవారికి మౌఖిక పరీక్షలను నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నాం.

- యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

ఇవీ చూడండి: పక్క గ్రామాలు సందర్శించేలా ఉండాలి: ఎమ్మెల్యే

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గా పని చేస్తున్న తిరునగరి స్వాతి కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాను రూపొందించారు ......ఈ యొక్క ప్రాజెక్టు నమూనా అట్టపెట్టెలతో నిర్మింఛానని తెలిపారు... పాఠశాలలోని విద్యార్థులకు కాలేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రత్యేకతలను కూలంకషంగా వివరించేందుకు తాను కాలేశ్వరం ప్రాజెక్టు నమూనా తయారీ తయారు చేశానని చెబుతున్నారు

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గా పని చేస్తున్న తిరునగరి స్వాతి కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాను రూపొందించారు ......ఈ యొక్క ప్రాజెక్టు నమూనా అట్టపెట్టెలతో నిర్మింఛానని తెలిపారు... పాఠశాలలోని విద్యార్థులకు కాలేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రత్యేకతలను కూలంకషంగా వివరించేందుకు తాను కాలేశ్వరం ప్రాజెక్టు నమూనా తయారీ తయారు చేశానని చెబుతున్నారు

Conclusion:9949336298
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.