ETV Bharat / state

sarpanch son argue with mla : ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన సర్పంచ్​ కుమారుడు.. ఏమైందంటే..

sarpanch son argue with mla : మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో చెత్తసేకరణ ఆటోల ప్రారంభోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్​ హాజరుకావాల్సి ఉండగా.. ఎమ్మెల్యే హాజరై ప్రారంభించడంతో... సమచారం ఇవ్వకుండా ఎలా వచ్చారని దేవరకద్ర సర్పంచ్​ కుమారుడు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

conflit
conflit
author img

By

Published : Dec 14, 2021, 9:34 PM IST

sarpanch son argue with mla : మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర గ్రామ పంచాయతీ వద్ద జరిగిన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచోసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్తసేకరణ వాహనాల పంపిణీకి ఎమ్మెల్యే, కలెక్టర్​ను ఆహ్వానించారు గ్రామస్థులు. కానీ కలెక్టర్​ వెంకట్రావు కార్యక్రమానికి హాజరుకాలేదు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​ రెడ్డి హాజరై వాహనాలను ప్రారంభించారు. ఈ విషయమై స్థానిక సర్పంచ్​ కుమారుడు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. గ్రామానికి వచ్చి ఆదరాబాదరాగా వాహనాలను ప్రారంభించి ఎలా వెళ్లిపోతారంటూ ప్రశ్నించారు.

జిల్లా కలెక్టర్​.. వేరే మీటింగ్​లో ఉండడం వల్ల హాజరుకాలేకపోయారని.. అందుకే తాను హాజరైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే తాము జిల్లా కలెక్టర్​ను ఆహ్వానించి గ్రామంలో సమస్యలు విన్నవించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని.. ఇలా ఆదరాబాదరాగా వచ్చి వెళ్లిపోతే ఎలా అని గ్రామ సర్పంచ్​ కుమారుడు టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి కొండ ప్రశాంత్​ రెడ్డి ప్రశ్నించారు. కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారో కనీసం గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 19 తర్వాత ప్రత్యేకంగా గ్రామ సభ నిర్వహిస్తే జిల్లా కలెక్టర్​ను తీసుకొచ్చి సమస్యలను పరిష్కరించేందుకు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చూడండి: corporator house demolished: తెరాస కార్పొరేటర్​ ఇంటిని కూల్చేసిన అధికారులు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.