మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లోని తుంగభద్ర పుష్కరాలకు పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఘాట్‌కు మూడు వందల మీటర్ల దూరంలో నాలుగు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వాహనాలను పార్కింగ్ స్థలాల్లో నిలిపి అక్కడి నుండి పుష్కరఘాట్‌కు నడుచుకుంటూ వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మస్కు లేని వాళ్లను అనుమతించడం లేదు.
ఎక్కడికక్కడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు. తుంగభద్ర పుష్కరాలకు సుమారు రెండు వేల సిబ్బందిని నియమించారు. పుష్కరఘాట్‌ను ఎమ్మెల్యే అబ్రాహం దేవాలయ ఛైర్మన్ రవి గౌడ్ పరిశీలించారు. తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పుష్కర స్నానం ఆచరించాల్సిందిగా అధికారులు కోరారు.