పారిశ్రామిక వివాదాల చట్టానికి వ్యతిరేకంగా తమ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కార్మిక శాఖ కార్యాలయం ముట్టడి నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. సమ్మె విరమించిన అనంతరం విధుల్లో చేరే హక్కు కార్మికులకు ఉందని... ఈ హక్కును కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడం న్యాయం కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి కార్మికులను ఉద్యోగాలలో చేర్చుకోవాలని కోరారు. ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవించి విధులకు హాజరయ్యేందుకు వస్తే... పోలీసులు తమపై దాడులు చేస్తూ... అరెస్టు చేశారని మండిపడ్డారు.
ఇదీ చూడండి: జేబీఎస్ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్