మహబూబ్నగర్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె పెద్దగా ప్రభావం చూపడం లేదు. తెల్లవారుజాము నుంచే డిపోల నుంచి బస్సులు బయటికి వచ్చాయి. డిపో పరిధిలో 96 ఆర్టీసీ బస్సులకు 56 బస్సులు రోడ్లపైకి రాగా.. 36 అద్దె బస్సులకుగాను 32 బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. సమ్మె మొదటి రోజు కాస్త ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు.. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో రెండోరోజు పూర్తిస్థాయిలో బస్సులు నడవడం వల్ల తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అధికంగా టికెట్ రేటు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తెలిపారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి