జడ్చర్ల వద్ద లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఘటనకు రహదారిపై నిర్మిస్తున్న అంతర్గత వంతెన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యమే కారణమని మహబూబ్నగర్ ఎస్పీ రెమారాజేశ్వరి నిర్ధరణకు వచ్చారు. ఘటనా స్థలిని డీఎస్పీ శ్రీధర్తో కలిసి పరిశీలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.
జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడం వల్ల జడ్చర్ల పై వంతెన సమీపంలో మరో అంతర్గత వంతెన నిర్మాణం పనులు చేపట్టారు. ఏడాది గడిచినా పనులు నత్తనడకన కొనసాగుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఈనాడు, ఈటీవీ భారత్ కథనాలు ప్రసారం చేసింది. కొత్తగా వచ్చిన సంబంధిత గుత్తేదారులు అతి వేగంగా వచ్చే వాహనాలను సర్వీస్ రోడ్లుకు మళ్లించేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఓ లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది.
ఇవీ చూడండి: 9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు