మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి శివారులో యథేచ్ఛగా సాగుతున్న మట్టి అక్రమ రవాణాపై ఈనాడు-ఈటీవీ ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించారు. మహబూబ్ నగర్ అర్బన్ మండలం రెవిన్యూ ఇన్స్పెక్టర్ క్రాంతి... సిబ్బందితో కలిసి వచ్చి మట్టి తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించారు. చాలాకాలంగా అప్పనపల్లి శివారులో మట్టిని అక్రమంగా తరలించినట్లు గుర్తించామని తెలిపారు.
అధికారుల అనుమతి లేకుండా మట్టి తరలించడానికి వీలు లేదని... ఇకపై మట్టిని తరలించే ప్రయత్నం చేస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపైన విచారణ జరుపుతామన్నారు. మట్టి మాఫియాపై నిఘా పెంచాలని వీఆర్వో, వీఆర్ఏలను ఆదేశించారు.
ఇదీ చూడండి: పాలమూరులో యథేచ్ఛగా మట్టి దందా