అర్హులైన రైతులకు రైతుబంధు డబ్బులు అందకపోతే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంతో పాటు బలీద్‌పల్లి, పెద్దమునుగల్, చేడు గ్రామాల్లో నిర్మించనున్న రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
రైతు బంధు పథకం కింద 55 లక్షల 5 వేల మందికి రూ.1.40 లక్షల ఎకరాలకు పెట్టుబడికి అవసరమయ్యేలా.. 7 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 4 లక్షల మందికి రైతుబంధు డబ్బులు రావాల్సి ఉందన్నారు. వారికి సైతం త్వరలోనే జమ చేస్తామని చెప్పారు.
వ్యవసాయ సమగ్ర సమాచారానికి 5 వేల ఎకరాలకు ఓ వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి.. క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు.