తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిస్వార్థంగా 13 ఏళ్లు పోరాటం చేసింది... తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మాత్రమేనని ప్రెస్ అకాడమి ఛైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. మార్చి 8న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభల సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సామాజిక స్పృహతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర అభివృద్దిలో భాగంగానే యూనియన్ ఏర్పాటు చేయడం జరిగిందని.. తెలంగాణ ఉద్యమంలో దిల్లీ వరకు తెలంగాణ వాణిని వినిపించడంలో కీలక పాత్ర పోషించామన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 259 మంది జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని.. లక్ష రూపాయలతోపాటు ప్రతి నెల మూడు వేల రూపాయలను అందించగలుగుతున్నామన్నారు. ఈ నెల 8న జరిగే రాష్ట్ర మహాసభలకు హలో జర్నలిస్ట్- ఛలో హైదరాబాద్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు కదిలి రావాలని కోరారు. యూనియన్ బలోపేతంతో జర్నలిస్టులకు సేవ చేసేందుకు సిద్ధపడాలని కోరారు.
ఇవీ చూడండి: అవును.. ప్రధాని గర్ల్‌ఫ్రెండ్ తల్లికాబోతోందట!