ETV Bharat / state

ఉమ్మడి పాలమూరులో మరోసారి డ్రైరన్ కోసం సర్వం సిద్ధం

author img

By

Published : Jan 8, 2021, 9:02 AM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో కొవిడ్ టీకా పంపిణీ డ్రైరన్ కోసం సర్వం సన్నద్ధమైంది. 95 కేంద్రాల్లో సుమారు 2,375 మంది డ్రైరన్​లో పాల్గొనున్నారు. ఇప్పటికే వారి సమాచారాన్ని కోవిన్ యాప్​లో నిక్షిప్తం చేశారు. టీకా వేయడం మినహా మిగిలిన ప్రక్రియల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఐదు జిల్లాల కలెక్టర్లు.. డ్రైరన్ ఏర్పాట్లను వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లా ఆసుపత్రులు, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీ కోసం మూడు గదులను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. ప్రతి కేంద్రంలో నలుగురు వాక్సినేటర్లు సహా వైద్యుడు అందుబాటులో ఉండనున్నారు.

ఉమ్మడి పాలమూరులో మరోసారి డ్రైరన్ కోసం సర్వం సిద్ధం
ఉమ్మడి పాలమూరులో మరోసారి డ్రైరన్ కోసం సర్వం సిద్ధం

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో శుక్రవారం నిర్వహించే కొవిడ్ వాక్సినేషన్ డ్రైరన్ కోసం సర్వం సిద్ధమైంది. ఐదు జిల్లాల వ్యాప్తంగా 95 కేంద్రాలను అందుకోసం సిద్ధం చేశారు. సుమారు 2,375 మంది నమూనా వాక్సినేషన్​లో పాల్గొననున్నారు. డ్రైరన్ కోసం 475 మంది వైద్యారోగ్య సిబ్బందిని వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రితోపాటు అన్ని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డ్రైరన్ జరగనుంది.

25 మంది..

ప్రతి కేంద్రంలో వెరిఫికేషన్, వాక్సినేషన్, అబ్జర్వేషన్ గదులను ఏర్పాటు చేశారు. టీకా వేయడం మినహా వాక్సినేషన్ కేంద్రానికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే పోయే వరకూ జరిగే 4 దశల పక్రియల అమలును డ్రైరన్​లో పరిశీలిస్తారు. ప్రతి కేంద్రంలో 25 మంది టీకా తీసుకోవడం కోసం హాజరవుతారు. ఇప్పటికే వారి సమాచారాన్ని కోవిన్ అప్లికేషన్​లో నిక్షిప్తమై ఉంది.

మరోసారి...

కేంద్రానికి వచ్చిన వారి సమాచారాన్ని డ్రైరన్​లో అధికారిక పత్రాల ఆధారంగా సరిచూస్తారు. అనంతరం వాక్సినేషన్, అబ్జర్వేషన్ ప్రక్రియను డమ్మీగా నిర్వహిస్తారు. ప్రతి కేంద్రంలో మాస్కులు ధరించిన వారికే ప్రవేశం ఉంటుంది. చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి. ఇప్పటికే మహబూబ్​నగర్ జిల్లాలో 3 చోట్ల తొలిదశ డ్రైరన్​ను విజయవంతంగా నిర్వహించారు. డ్రైరన్​లో గమనించిన అంశాలను ప్రభుత్వానికి నివేదించారు. శుక్రవారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించనున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్

పరిశీలన...

డ్రైరన్ సన్నద్దతను కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. ఎదిర గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ చేసే గదిని పరిశీలించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బయోమెడికల్ వేస్ట్ కోసం నాలుగు డస్ట్​బిన్​లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత డాక్టరుకు, సిబ్బందికి సూచించారు. నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్, వైద్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. డ్రైరన్‌కు సంబంధించిన వివరాలపై సమీక్షించారు. జిల్లాలో 32 ప్రదేశాలను ట్రయల్‌ రన్‌ కోసం ఎంపిక చేసిన కేంద్రాల్లో విజయవంతం చేయాలన్నారు.

ఏర్పాట్లపై నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ రివ్యూ

సమీక్ష...

డ్రైరన్ అనంతరం జిల్లాస్థాయి, మండల స్థాయి కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. గద్వాల కలెక్టర్ శృతి ఓఝా సమీక్షించారు. నారాయణపేటలో జిల్లా కలెక్టరేట్ ఛాంబర్​లో జిల్లా కలెక్టర్ హరిచందన జిల్లా వైద్యాధికారులతో సమవేశమయ్యారు. జిల్లాలో 11 ప్రాథమికరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుప్రత్రిలో డ్రైరన్ జరగనుంది.

ఏర్పాట్లపై సమావేశమైన నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన

సమస్యలపై దృష్టి...

మహబూబ్​నగర్ జిల్లాలో మొదట జరిగిన డ్రైరన్​లో ప్రవేశ ద్వారం, బయటకు వెళ్లే దారి వేర్వేరుగా ఉండాలని, పర్యవేక్షణ గదుల పెద్దవిగా ఉండాలని, టీకా తీసుకునేందుకు వచ్చే వారిలో ఒకే పేరుతో ఉన్నవాళ్ల పత్రాల పరిశీలన విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు గుర్తించారు. జిల్లా నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి వరకూ జరిగే డ్రైరన్ టీకా పంపిణీలో ఏర్పడే ఇబ్బందులపై దృష్టిసారించనున్నారు.

అధికారులతో సమీక్షించిన జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్

కొవిడ్ వాక్సిన్ డ్రైరన్ సమాచారం

జిల్లాపేరు కేంద్రాలు టీకా తీసుకునే వారి సంఖ్యసిబ్బంది
మహబూబ్​నగర్25 625 125
నాగర్​కర్నూల్32 800 160
నారాయణపేట 12 300 60
వనపర్తి 15 375 75
గద్వాల 11 275 55
మొత్తం95 2375 475

ఇదీ చూడండి: రాష్ట్రంలోని 1,200 కేంద్రాల్లో నేడు కొవిడ్‌ టీకా డ్రైరన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.