ETV Bharat / state

'తపాలా శాఖ అమలు చేసే పథకాలు ప్రజలకు చేరువ కావాలి' - మహబూబ్​నగర్​ తాజా వార్త

తపాలా కార్యాలయాల ద్వారా మంచి సేవలు అందించి దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ తపాలాశాఖ సేవల్లో అగ్రగామిగా నిలవాలని ఆ శాఖ రాష్ట్ర చీఫ్ పోస్ట్​ మాస్టర్​ జనరల్ సంధ్యారాణి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గ్రామీణ పోస్ట్​మాస్టర్లతో తపాలాశాఖ అమలు చేస్తున్న పథకాలపై సదస్సును నిర్వహించారు.

postal department meeting in mahabubnagar
'తపాలశాఖ అమలు చేసే పథకాలు ప్రజలకు చేరువకావాలి'
author img

By

Published : Feb 13, 2020, 12:02 PM IST

తపాలా బ్యాంకు సేవల్లో వనపర్తి డివిజన్ దేశంలోనే ఇతర డివిజన్ల కంటే మంచి ఫలితాలు సాధించడం గర్వించదగ్గ పరిణామమని పోస్ట్​మాస్టర్ జనరల్ సంధ్యారాణి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని గ్రామీణ పోస్ట్​మాస్టర్లతో తపాలాశాఖ అమలు చేస్తున్న పథకాలపై సదస్సు నిర్వహించారు.

తపాలాశాఖ అమలు చేసే పథకాలు ప్రజలకు చేరువ కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబరచిన తపాలా శాఖ సిబ్బందిని అధికారులు పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్​మాస్టర్ జనరల్ హనుమాన్ సింగ్, వనపర్తి డివిజన్ పర్యవేక్షకులు శ్రీనివాస్, ఏఎస్పీ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

'తపాలశాఖ అమలు చేసే పథకాలు ప్రజలకు చేరువకావాలి'

ఇదీ చూడండి: 'వాళ్లు లంచాలు ఇస్తే వీళ్లు అనుమతి పత్రాలు ఇస్తారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.