కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పాలమూరు జిల్లాలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా... సంబంధిత కాలనీలను రెడ్జోన్లుగా ప్రకటించారు. ఈ కాలనీల్లో నుంచి ప్రజలు బయటకు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు.
నిషేధిత ప్రాంతాల్లో బారికేడ్లు తొలగించి వీధుల్లో తిరుగుతున్న వారిని పోలీసులు గుర్తించారు. ప్రజలెవరూ బయట తిరగకుండా 8 అడుగుల ఎత్తు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేసేందుకు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.