ETV Bharat / state

'సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్'​ పై ఫిర్యాదు - mahaboobnagar

రెండో విడత పరిషత్​ ఎన్నికల సందర్భంగా మహబూబ్​నగర్​ జిల్లాలో ఓటేసిన బ్యాలెట్​ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఘటనపై అధికారులు దృష్టిసారించారు. బ్యాలెట్​ క్రమసంఖ్య ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్'​ పై ఫిర్యాదు
author img

By

Published : May 12, 2019, 4:31 PM IST

'సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్'​ పై ఫిర్యాదు
మహబూబ్​నగర్​ జిల్లా రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటేసిన బ్యాలెట్​ పత్రాలను ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ ఘటనపై దృష్టిసారించిన అధికారులు క్రమ సంఖ్య ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించారు. దేవరకద్ర మండలం డోకూర్​ ఎంపీటీసీ పరిధిలో మీనుగోనుపల్లి గ్రామం 53 పోలింగ్​ కేంద్రంలో ఫోటో తీసినట్లుగా అధికారులు నిర్ధరణకు వచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పీవో మంజులత, ఇంఛార్జీ ఎంపీడీవో శ్రీనివాస్ స్థానిక పోలీస్​ స్టేషన్​లో ​ ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: తుపాకీ మిస్​ఫైర్- పోలింగ్​ అధికారి మృతి

Intro:Tg_Mbnr_06_12_Complet_on_byalet_ paper_issue_Avb_G3
బయటి కొచ్చిన బ్యాలెట్ పత్రాలు అనే శీర్షికతో ఈనాడులో లో ప్రచురితమైన వార్త కథనానికి అధికార యంత్రాంగం అప్రమత్తమై ఓటు వేసి బ్యాలెట్ పత్రాలను ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన సంబంధిత నిందితుడిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లోని డోకూర్ ఎంపీటీసీ స్థానం పరిధిలో ఉన్న మీనుగోని పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 53వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు పోలింగ్ అధికారులకు తెలియకుండా ఓటు వేసిన అనంతరం పత్రాలను సెల్ ఫోన్ తో ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో లో ఉంచాడు. ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు వైరల్ గా మారిన విషయం ఈనాడు దినపత్రికలో "బయటికొచ్చిన బ్యాలెట్ పత్రాలు" అనే శీర్షికతో ప్రచురితమైంది.
గమనించిన సంబంధిత అధికారులు బ్యాలెట్ పత్రాల పై ఓటు వేసి ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో లో పెట్టడం ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం నేరం. అందుకు ఉన్నత అధికారుల ఆదేశానుసారం దేవరకద్ర ఇంచార్జి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తో సంబంధిత 53వ పోలింగ్ కేంద్రం ఎన్నికల అధికారిని విచారణ చేపట్టి కౌంటర్ ఫైల్ ఆధారంగా బ్యాలెట్ పత్రాల పై ఓటు వేసి ఫోటో తీసిన వ్యక్తిని గుర్తించారు.
ఓటు వేసి ఫోటో తీసి బ్యాలెట్ పత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వ్యక్తిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేశారు
బైట్: శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో దేవరకద్ర

Conclusion:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని 53వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి బ్యాలెట్ పత్రాలను చిత్రీకరణ చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచిన సదరు ఓటరుపై ఎన్నికల అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.