ETV Bharat / state

కృష్ణమ్మ పరవళ్లు... నదీ తీర ప్రాంత ప్రజలకు కన్నీళ్లు... - వరద కృష్ణమ్మ

రాష్ట్రంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు నదీ తీర ప్రాంతాలవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహబూబ్​నగర్​, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రధాన పంటలు నీట మునిగాయి. ప్రముఖ ఆలయాలను కూడా గంగమ్మ తల్లి చుట్టుముట్టింది.

కృష్ణమ్మ పరవళ్లు
author img

By

Published : Aug 11, 2019, 9:37 PM IST

Updated : Aug 11, 2019, 10:29 PM IST

కృష్ణమ్మ పరవళ్లు... నదీ తీర ప్రాంత ప్రజలకు కన్నీళ్లు...

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగింది. గతంలో ఎన్నడూ లేనంతగా జూరాలకు ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వరద తాకిడికి జూరాల ప్రాజెక్టు అన్ని గేట్లను తెరచి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు వరద ఉద్ధృతికి జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. ముందే అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వనపర్తి జిల్లాలో జల దిగ్బంధంలో చిక్కుకున్న పలువురిని పోలీసులు కాపాడారు. కేవలం పంట నష్టం మినహా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

జలాశయాలకు భారీగా వరద

గతంలో ఎన్నడూ లేని విధంగా జూరాలకు వరద నీరు పోటెత్తింది. పదేళ్ల తర్వాత దాదాపు 9 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 62 గేట్ల ద్వారా ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతిని తట్టుకోవడానికి జూరాలలో నీటి నిల్వను ఐదున్నర టీఎంసీలకు తగ్గించారు. ఈ వరద మరో 24 గంటలు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రజల తరలింపు

కృష్ణానది ఉప్పొంగడం వల్ల నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో వాసునగర్​ పూర్తిగా నీట మునిగింది. హిందూపూర్​లోని ఎస్సీ వాడల్లో ఇళ్లలోకి నీరు చేరి అక్కడి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా-హిందూపూర్​, కృష్ణా-గురజాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మక్తల్ పసుపుల, వల్లభాపూర్, కురిమిగడ్డలో ఆలయాలు నీటమునిగాయి. నారాయణపేట కలెక్టర్​ వెంకట్రావు వరద ఉద్ధృతిపై సమీక్ష నిర్వహించారు. ముంపునకు అవకాశం ఉన్న ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించారు. జిల్లా ఎస్పీ చేతన సైతం ముంపునకు అవకాశం ఉన్న ముడుమాల్​లో పరిస్థితిని పరిశీలించారు. ఎవరూ నదీ తీరాల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

గద్వాలలో నీట మునిగిన ఆలయాలు

ఇటిక్యాల మండలం బీచుపల్లి శివాలయం, రామాలయం నీట మునిగాయి. ఉండవల్లి, అలంపూర్ మండలంలోని నదీతీరాల ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బీరెల్లి, నది అగ్రహారం, చింతరేవుల, నెట్టెంపాడు, నాగర్ దొడ్డి, భీంపురం గ్రామాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పర్యటించి... పంట నష్టపోయిన వారికి పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజాప్రతినిధుల పర్యటన

కృష్ణా నదీ పరివాహక ముంపు ప్రభావిత గ్రామాలైన మునగమాన్ దిన్నె, పెంచికలపాడు, రంగాపూర్, బీచుపల్లి గ్రామాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. సహాయక చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి : రేపు ఉదయం 8 గంటలకు సాగర్​ క్రస్ట్​గేట్లు ఎత్తివేత

Intro:tg_adb_93_11_annabavsaate_jayanti_ts10031

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం9490917560...
...
ఘనంగా అన్న బావు సాటే జయంతి వేడుకలు
...
( ):- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామంలో అన్నాబావు సాటే 99 వ జయంతి వేడుకలను దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహిత్య సామ్రాట్ అన్నా బావు సాటే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ , ఛత్రపతి శివాజీ, బాబుజగ్జీవన్ రావు చిత్రపటాలకు స్థానిక నాయకులతో కలిసి దళిత నాయకులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు వారి త్యాగాలను కొనియాడారు. క్రాంతివీర్ లవ్ జీ సాలేవే,ముక్తాభాయి సాల్వే మాంగ్ సమాజం జెండాలను ఆవిష్కరించారు. అన్నబావు సాటే దళితుల అభ్యున్నతి కోసం తన సాహిత్యం ద్వారా అనేక విషయాలు సాహిత్యం ద్వారా తెలియ జెసి వారిని చైతన్య పరిచారని ఈ సందర్భంగా పలువురు వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, దళిత సంఘాల వారు పాల్గొన్నారు.

Conclusion:.
Last Updated : Aug 11, 2019, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.