మహబూబ్‌నగర్ జిల్లాలో రెండోరోజు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనేందుకు రోడ్లపైకి రావడం వల్ల పరిమితికి మించి వాహనాలు తిరుగుతున్నాయి.
ప్రజా రవాణా వ్యవస్థలైన ఆటోలు, ప్రైవేటు వాహనాలు తిరగకూడదని ఆదేశాలున్నా.. వాటిని బేఖాతరు చేస్తూ పలువురు రహదారులపైకి వస్తున్నారు.
వ్యక్తిగత పని నిమిత్తం దిల్లీకి చెందిన పది మంది మహబూబ్‌నగర్‌కు వచ్చారు. లాక్డౌన్ ప్రకటించడం వల్ల తమ స్వస్థలానికి వెళ్లడానికి జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
- ఇదీ చూడండి : పాతబస్తీలోని మద్యం, కల్లు కాంపౌండ్లు సీజ్