ETV Bharat / state

Palamuru Rangareddy Project Dry Run : తుదిదశకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు... వారం రోజుల్లో డ్రై రన్‌ - Palamuru Rangareddy Lift Irrigation Project news

Palamuru Rangareddy Project Dry Run : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్‌ జలాశయంలో కనీసం ఒక్క మోటారు ద్వారా నైనా నీళ్లు ఎత్తి పోసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు మొదటి పంప్‌హౌజ్‌లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్‌ మొదటి వారంలో డ్రైరన్‌, తర్వాతి 15 రోజుల్లో వెట్‌ రన్‌ నిర్వహించాలని అధికారులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు.

palamuru rangareddy project upda
Palamuru Rangareddy Project Dry Run
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 7:00 AM IST

Updated : Aug 30, 2023, 10:02 AM IST

Palamuru Rangareddy Project Dry Run తుదిదశకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వారం రోజుల్లో డ్రై రన్‌

Palamuru Rangareddy Project Dry Run in a week : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం( Palamuru Rangareddy Project )లో పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు నీటి పారుదల శాఖ( Irrigation Department ) కసరత్తులు చేస్తోంది. సెప్టెంబర్‌ చివరి నాటికి కనీసం ఒక్క మోటారునైనా నడిపించేందుకు పనులు సాగుతున్నాయి. సమీపంలోని MGKLI ఎల్లూరు పంప్‌హౌజ్‌ నుంచి 11 KVA విద్యుత్‌ లైన్లను నార్లాపూర్‌ పంప్‌హౌజ్‌ వరకు నిర్మించగా ప్రస్తుతం స్విచ్ యార్డు పనులు జరుగుతున్నాయి.

Palamuru Rangareddy project in the final stage : పాలమూరు ఎత్తిపోతలలో ఒక్కో పంపు 145 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. డ్రై రన్‌ కోసం 4 మెగావాట్ల విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న అధికారులు.. అందుకు తగిన పనులు పూర్తి చేస్తున్నారు. డ్రైరన్‌ కోసం ఓ మోటారు సిద్ధంగా ఉండగా రెండో మోటారును బిగించే పనులు వేగంగా సాగుతున్నాయి. మొదటి పంప్‌ వెట్‌ రన్‌ చేసే సమయానికి రెండో పంప్‌ డ్రైరన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మోటారు సక్రమంగా నడుస్తుందా లేదా అన్నది డ్రైరన్‌లో 3-4 గంటల పాటు పరీక్షించనున్నారు.

Palamuru Rangareddy Lift Irrigation Project : 'పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు'

Palamuru Rangareddy Liftworks : మొదటి మోటారు డ్రైరన్ అనంతరం తలెత్తిన ఇబ్బందులను సరిచేసి 15 రోజుల్లో వెట్ రన్ సైతం నిర్వహించనున్నారు. అయితే, దీనికోసం శ్రీశైలం వెనకజలాల నుంచి ఎత్తిపోసుకునేందుకు అనుగుణంగా కృష్ణా జలాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతానికి కావాల్సిన మేర నీళ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 260 మీటర్ల వరకు నీరు ఉన్నందున వెట్​రన్ చేసేందుకు కూడా అవకాశం ఉందని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాజెక్ట్ మోటార్లు నడిపేందుకు 244.4 మీటర్ల మేర నీరు ఉంటే సరిపోతుంది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చేనెల ఒకటో తారీఖు డ్రైరన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పంప్​హౌస్​లో 2 పంపులకు సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయి. వెట్​ రన్​ కోసం అప్రోచ్ కెనాల్, హెడ్​ రెగ్యులేటర్ పనులు ఇంటెక్ టెన్నెల్ పనులు పూర్తి అయ్యాయి. సర్జ్​పూల్ పనులు కూడా సెప్టెంబర్ 15 వరకు పూర్తి చేసి మొదటి పంప్​ వెట్​రన్ నిర్వహిస్తాం- శ్రీనివాసరావు, ఈఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్

Palamuru Rangareddy Project : పాలమూరు రంగారెడ్డిపై ప్రతీకారేచ్ఛతోనే పిటిషన్లు

శ్రీశైలం ప్రాజెక్ట్​లోని నీరు... అప్రోచ్ కెనాల్‌, హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా ఇంటెక్‌వెల్‌ లోకి చేరుతుంది. ఇంటెక్‌ వెల్ నుంచి రెండు సొరంగ మార్గాల ద్వారా సర్జ్‌పూల్‌ని తాకుతాయి. సర్జ్‌పూల్‌లో నిండిన నీటిని మోటారు ద్వారా నార్లాపూర్‌ జలాశయంలో ఎత్తిపోస్తే వెట్‌రన్ విజయవంతమవుతుంది. ఈ మేరకు పంప్‌హౌడ్‌ డెలివరీ మెయిన్స్‌ సహా ఇతర నిర్మాణాలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాల్సి ఉంది. CM KCR ఆదేశాల మేరకు ఆగస్టు చివరి నాటికే కరివెన జలాశయంలోకి కనీసం ఒక్క మోటారుతోనైనా నీళ్లు ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఆ మేరకు పనులు కాలేదు. కనీసం సెప్టెంబర్‌లో నార్లాపూర్‌ జలాశయంలోకైనా నీటిని పంప్​ చేయాలని అధికారులు లక్ష్యంగా పనిచేస్తున్నారు.

CM KCR fires on Congress : 'పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకుంది కాంగ్రెస్ నేతలే'

KTR Open Letter : పాలమూరు-రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు ఇవ్వండి.. కేటీఆర్​ బహిరంగ లేఖ

Last Updated : Aug 30, 2023, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.