Palamuru Rangareddy Dry Run Success : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కనీసం ఒక్క మోటార్‌తోనైనా కరివేన జలాశయం వరకు నీళ్లు ఎత్తిపోయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యసాధన దిశగా ఆదివారం మొదటి అడుగు పడింది. పీఆర్‌ఎల్‌ఐలోని మొదటి పంప్‌హౌస్‌లో ఇప్పటికే సిద్ధమైన ఒక మోటార్‌కు అధికారులు.. డ్రై రన్ విజయవంతంగా పూర్తి చేశారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్(Rajat Kumar), ఈఎన్సీ మురళీధర్ రావు, నాగర్ కర్నూల్ జిల్లా సీఈ హమీద్ ఖాన్ ప్రత్యేక పూజలు నిర్వహించి డ్రై రన్ ప్రారంభించారు.
Narlapur Pump House Dry Run in PRLIS : ప్రాజెక్ట్ పనులను పరిశీలించి, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. మిగతా పనులను వేగవంతం చేయాలని వారు ఆదేశించారు. డ్రై రన్ విజయవంతం కావడంతో మరో 15 రోజుల్లో వెట్ రన్‌కు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయం వెనక జలాల నుంచి నీటిని ఒక మోటార్ ద్వారా నార్లాపూర్ జలాశయంలోకి ఎత్తిపోయనున్నారు. 45 రోజుల్లో కరివేన జలాశయం వరకు నీళ్లు ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రజత్ కుమార్ వెల్లడించారు.
CM KCR: 'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పరుగులు పెట్టాలి'
Palamuru Rangareddy Project Updates : నార్లాపూర్ తర్వాత ఏదుల, వట్టెం జలాశయాల్లోని పంప్ హౌస్‌లలోని మోటార్లకు కూడా డ్రై రన్, ఆ తర్వాత వెట్‌రన్ నిర్వహించి ఆయా జలాశయాలను నింపుతారు. వట్టెం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నేరుగా నీళ్లు కరివేన జలాశయం వరకు చేరుతాయి. అందుకు సంబంధించి పూర్తి కావాల్సిన జలాశయాలు, సొరంగ మార్గాలు, బహిరంగ కాలువలు, సర్జ్ పూల్, పంపు హౌస్‌లలో మిగిలిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 15 నాటికి కరివెన వరకు నీళ్లు ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రజత్ కుమార్ తెలిపారు.
పాలమూర-రంగారెడ్డి పథకం లక్ష్యం అదే.. : శ్రీశైలం జలాశయం(Srisailam Dam)లో 90 టీఎంసీల మిగులు జలాలు ఎత్తిపోయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందించడం, పారిశ్రామిక అవసరాలకు, తాగునీటికి కృష్ణా జలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులను, రూ.52 వేల కోట్లకు సవరించింది. ఇప్పటికే 50 శాతానికిపైగా ప్రాజెక్టు పనులు పూర్తి కాగా.. గత ఏడాది హరిత ట్రిబ్యునల్ తీర్పుతో ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తాగునీటి కోసం మాత్రమే పనులు చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
అనంతరం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని(Palamuru Rangareddy Lift Irrigation)కి కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. కోర్టు కేసులు, భూసేకరణలో జాప్యం ఇతర కారణాలతో ఆలస్యమైన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ సైతం పూర్తి చేసి.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఏడాదిలోనే జలాశయాలను నింపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
-
ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం!
— KTR (@KTRBRS) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
సగర్వంగా ఎగురుతున్నది తెలంగాణ జలవిజయ పతాకం!
నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం.
ఇది తెలంగాణ సాగునీటిరంగంలో మరో కాళేశ్వరం.
అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ...
కుట్రలను, కేసులను గెలుస్తూ..
జలసంకల్పంతో… pic.twitter.com/qBmu9SHyo7
">ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం!
— KTR (@KTRBRS) September 4, 2023
సగర్వంగా ఎగురుతున్నది తెలంగాణ జలవిజయ పతాకం!
నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం.
ఇది తెలంగాణ సాగునీటిరంగంలో మరో కాళేశ్వరం.
అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ...
కుట్రలను, కేసులను గెలుస్తూ..
జలసంకల్పంతో… pic.twitter.com/qBmu9SHyo7ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం!
— KTR (@KTRBRS) September 4, 2023
సగర్వంగా ఎగురుతున్నది తెలంగాణ జలవిజయ పతాకం!
నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం.
ఇది తెలంగాణ సాగునీటిరంగంలో మరో కాళేశ్వరం.
అవాంతరాలను, అడ్డంకులను అధిగమిస్తూ...
కుట్రలను, కేసులను గెలుస్తూ..
జలసంకల్పంతో… pic.twitter.com/qBmu9SHyo7
మరోవైపు.. నార్లాపూర్ పంప్‌హౌస్ డ్రై రన్ విజయవంతంపై మంత్రి కేటీఆర్ 'ఎక్స్' (ట్విటర్) వేదికగా స్పందించారు. 'ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం! సగర్వంగా ఎగురుతున్నది తెలంగాణ జలవిజయ పతాకం! నీటి కోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం.. ఇది తెలంగాణ సాగునీటి రంగంలో మరో కాళేశ్వరం' అంటూ హర్షం వ్యక్తం చేశారు.