ETV Bharat / state

అత్యవసర సేవలందిస్తున్న వారికి పాలమూరు సెల్యూట్

కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. నారాయణపేట, వనపర్తి, నాగర్​కర్నూల్​, జోగులాంబ గద్వాల, పాలమూరు జిల్లాల ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు.

palamuru district people support janatha curfew
అత్యవసర సేవలందిస్తున్న వారికి పాలమూరు సెల్యూట్
author img

By

Published : Mar 23, 2020, 9:58 AM IST

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ప్రజలంతా సంఘీభావంగా ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూనకు మద్దతు తెలిపారు. కరోనా వైరస్​ వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న వారికి, వైరస్​ సోకిన వారికి వైద్యచికిత్స చేస్తున్న వారందరి సేవలను కొనియాడుతూ.. నారాయణపేట, వనపర్తి, నాగర్​ కర్నూల్​, గద్వాల, మహబూబ్​నగర్​ జిల్లాల ప్రజలు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.

తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి గద్వాల శాసనసభ్యులు కృష్ణమోహన్​రెడ్డి సెల్యూట్​ చేశారు. వారితో పాటు కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు ఎస్పీ అపూర్వ, పోలీసులు ఉన్నతాధికారులు చప్పట్లతో మద్దతు తెలియజేశారు.

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. వైరస్​ను కట్టడి చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకునేందుకు.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ-కర్ణాటక అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.