మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లికి బహిరంగ వేలంలో మంచి ధర లభించింది. గత వారంతో పోలిస్తే క్వింటాకు రూ. 400 పెరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చిన ఉల్లికి క్వింటాకు ధర రూ. 5,000 నుంచి రూ. 7, 800 వరకు కొనసాగింది. నాణ్యతలేని చిన్న చిన్న పేడు ఉల్లి సైతం రూ.3000 ధర పలకడం గమనార్హం.
ఈ ధరలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. పేద, మధ్యతరగతి వినియోగదారులు మాత్రం ఉల్లిని కొనేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవీ చూడండి: పౌరసత్వ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం