మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో లక్ష విలువైవ నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కంపెనీలను పోలిన ప్యాకింగ్లతో సిగరెట్లు తెచ్చి దుకాణాలకు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి వ్యాపారులు అనేక మంది ఉన్నారని.. విచారణలో అసలు సూత్రధారులు ఎవరో తెలుస్తుందని స్థానికులు తెలిపారు.
ఇవీ చూడండి:ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!