మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆస్తుల నమోదు ప్రక్రియను మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. వ్యవసాయ పాస్బుక్ల మాదిరిగానే.. వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్‌బుక్కులు జారీ చేసేందుకే ధరణి సర్వే నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలు సర్వేకు సహకరించి.. సరైన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ధరణి సర్వే పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆస్తుల నమోదుకు అవసరమైన సమాచారాన్ని ప్రజలు ముందే సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలని.. అలా చేస్తే.. అధికారులు వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఉండదని, పొరపాట్లు జరగవని జిల్లా కలెక్టర్ వెంకట రావు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని షాసాబ్ గుట్టలో ఆయన ఆస్తుల నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. అంతకంటే ముందు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో 88 క్లస్టర్లలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను దసరా లోపు పూర్తి చేసి.. ప్రారంభానికి ముందే సిద్ధం చేయాలని సూచించారు. రైతు వేదికలను అన్ని హంగులతో సుందరంగా నిర్మాణం చేసి.. చుట్టూ మొక్కలు నాటాలన్నారు.
ఇదీ చదవండి : అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం