ఒడిశాకు చెందిన కొన్ని కుటుంబాలు 5 నెలల క్రితం నారాయణపేట జిల్లాకు వలస వచ్చాయి. ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు జిన్నారం గ్రామ సమీపంలోని యజమానులతో కూలీలు ఒప్పందం చేసుకున్నారు. పనిచేసే చోటే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. లాక్‌డౌన్ పరిస్థితుల్లో స్వస్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చేసే పని పూర్తయిందంటూ స్వరాష్ట్రానికి బయల్దేరారు. ఇటుక బట్టీ యజమాని వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఊరెళ్లాలంటే అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. కావాలంటే మరికొంత కాలం పనిచేస్తూ ఇక్కడే ఉండమని కోరారు. అందుకు నిరాకరించిన వలస కూలీలు ఇటక బట్టీ యజమానితో గొడవపడి బుధవారం అర్ధరాత్రి కాలినడకన బయల్దేరారు.
60 మంది వలస కూలీలు పిల్లాపాపలతో కలిసి 40 కిలోమీటర్ల మేర నడిచారు. సామాన్లు నెత్తిన పెట్టుకుని మండుటెండల్లో గమ్యానికి చేరే సాహసానికి పూనుకున్నారు. జిన్నారం నుంచి దేవరకద్ర చేరుకొని అక్కడ పోలీసులను ఆశ్రయించారు. అక్కడి నుంచి భూత్పూర్ మీదుగా మహబూబ్‌నగర్ చేరుకున్నారు. వారిని గమనించిన అధికారులు నిరాశ్రయుల కేంద్రానికి తరలించి ఆహారం పెట్టారు. అక్కడ కూడా ఉండమంటున్న వలస కూలీలు తమను ఒడిశాకు పంపించాలని వేడుకుంటున్నారు.
మహబూబ్‌నగర్‌లో ఉన్న వలస కూలీలను తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జిన్నారం సమీపంలోని ఇటుక వ్యాపారితో మాట్లాడి పని కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నారు. వలస కూలీలు ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలతో కాలినడకన వెళ్లవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:'వలస కార్మికుల తరలింపులో చొరవ తీసుకోండి