ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి - railway_track

రోగుల గాయాలు మానిపించి... మందులు ఇచ్చి సేవలు చేసే ఆ సున్నిత మనస్కురాలు తనకు కలిగిన కష్టానికి మందు వేసుకోలేక పోయింది. మూడేళ్లుగా నర్సుగా విధులు నిర్వహిస్తూ పనిలో క్రమశిక్షణ పాటించిన ఆ యువతి క్షణికావేశంలో చావే శరణ్యమనుకుంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడమే కారణంగా తెలుస్తున్నా... ఆమెది హత్యో, ఆత్మహత్యో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

యువతి మృతి
author img

By

Published : Apr 10, 2019, 12:40 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలోని విజయ నర్సింగ్ పాఠశాలలో విద్యను అభ్యసించి గత మూడేళ్లుగా అదే పాఠశాలలో నర్సుగా పనిచేస్తున్నారు మాధవి. భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన మాధవికి నిన్న నుంచి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏ కారణం చేతనో తనకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని కుటుంబ సభ్యులకు మృతురాలు చెప్పినట్లు సమాచారం.

యువతి మృతి

హత్యా..? ఆత్మహత్యా?
నర్సుగా విధులు నిర్వహిస్తున్న మాధవి క్రమశిక్షణతో ఉండేదని సహోద్యోగులు తెలిపారు. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందో... పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకే చనిపోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: మావోల దాడిలో ఎమ్మెల్యే సహా నలుగురు మృతి

Intro:నర్సింగ్ విద్యను పూర్తిచేసి నర్సుగా విధులు నిర్వహిస్తున్న యువతి అనుమానాస్పద మృతి చెందినది రైలు పట్టాలపై ఆమె శవం పడి ఉండటం పక్కనే నర్సింగ్ కళాశాల ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లో చోటు చేసుకున్న పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

Body:జడ్చర్ల లోని విజయ నర్సింగ్ పాఠశాల లో నర్సింగ్ విద్యను అభ్యసించి గత మూడేళ్లుగా ఇదే పాఠశాలలో నర్సుగా గా మాధవి అనే యువతి పనిచేస్తున్నది బూత్ పూర్ మండలం annasagar గ్రామానికి చెందిన మాధవి నర్సింగ్ పాఠశాల పక్కనే ఉన్న రైల్వే పట్టాలపై మృతదేహం పడి ఉన్నది ఆమెకు నిన్న పెళ్లి సంబంధాల కోసం అం ఆమెకు పెండ్లి ఇష్టం లేదని నిరాకరించినట్టు సహచరులు తెలిపారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్న దా లేదా మరెవరైనా హత్య చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Conclusion:నర్సి గా విధులు నిర్వహిస్తున్న మాధవి క్రమశిక్షణతో ఉండేదని కానీ ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన కారణం వివాహ సంబంధాలు చూడమని పోలీసులు కూడా భావిస్తున్న ఈ సంఘటనతో జడ్చర్లలోని సిగ్నల్ గడ్డలు భారీ ఎత్తున జనం మృతదేహాన్ని చూసేందుకు తరలి వచ్చారు సంఘటనా స్థలం వద్ద పలు సందేహాలు వ్యక్తం చేశారు రైల్వే పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.