ETV Bharat / state

బాణాసంచా వ్యాపారాలపై కరోనా దెబ్బ..

కొవిడ్ ఈసారి దీపావళి వ్యాపారాలపై కోలుకోలేని దెబ్బతీసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దీపావళి రోజున బాణాసంచా దుకాణాలు తెరచుకున్నా.. గిరాకీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. పెద్దఎత్తున టపాసులు తెచ్చి పెట్టిన వ్యాపారులు.. తమ పరిస్థితి అగమ్యగోచరమైందని ఆవేదన చెందుతున్నారు.

బాణాసంచా వ్యాపారాలపై కరోనా దెబ్బ..
బాణాసంచా వ్యాపారాలపై కరోనా దెబ్బ..
author img

By

Published : Nov 14, 2020, 2:48 PM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా వ్యాప్తంగా బాణాసంచాపై ఏటా రూ. 12 కోట్ల వ్యాపారం జరుగుతుంది. వ్యాపారులు, షెడ్డు, పందిళ్ల నిర్వాహకులు, లైటింగ్‌ యజమానులు, నీటి వ్యాపారులు దీపావళి సందర్భంగా ఉపాధి పొందుతారు. దీని ద్వారా వచ్చిన లాభాలు ఆ కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉండేవి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికిపైగా పండుగ వేళ ఉపాధి పొందుతారు.

కరోనా ప్రభావం ఈ వ్యాపారాలపై పడింది. సుప్రీంకోర్టు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు బాణాసంచా కాల్చేందుకు అనుమతి ఇచ్చినా.. జనాలు మాత్రం కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికే బాణాసంచా స్టాక్‌ను పూర్తి స్థాయిలో తెచ్చిపెట్టుకున్నామని, దీని ద్వారా తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని మహబూబ్‌నగర్‌ బాణసంచా దుకాణ దారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో గుంపులుగా వచ్చే జనం ఈసారి తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారని వాపోయారు.

ఏటా రెండు, మూడు రోజుల పాటు జోరుగా విక్రయాలు జరిగేవి. ఈసారి శనివారం ఒక్కరోజే అమ్ముకునే అవకాశం ఉంది. అయితే జనాల్లో కరోనాపై భయాందోళనలు, నిషేధంపై సరైన సమాచారం లేక రావడం లేదని దుకాణ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆవు పేడతో ప్రమిదల తయారీ.. ఎక్కడంటే..?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.