ETV Bharat / state

సౌరశక్తి దీపాలే కాదు... రుతురుమాళ్లు కూడా

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మేం ఎవ‌రికీ త‌క్కువ కాద‌ని నిరూపిస్తున్నారు. ఇప్పటి వరకు సౌరశక్తి దీపాలను తయారు చేసిన పాలమూరు దివ్యాంగుల సంఘం ఇప్పుడు మరో ఘనతను సాధించేందుకు సిద్ధమైంది. రుతు రుమాళ్లను తయారు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నది.

మేం ఎవ‌రికీ త‌క్కువ కాద‌ు
author img

By

Published : Jun 11, 2019, 4:47 PM IST

మహబూబ్​నగర్​ జిల్లాలో కలెక్టర్ రోనాల్డ్ రోస్​ సహకారంతో దివ్యాంగులు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి... తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. పాలమూరు దివ్యాంగ్​ సొసైటి ఆధ్వర్యంలో సరికొత్త ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పటి వరకు దివ్యాంగ మహిళలు సౌరశక్తి దీపాలను తయారు చేసి విక్రయిస్తుండగా.. తాజాగా రుతురుమాళ్ల తయారు చేసే కేంద్రాన్ని ప్రారంభించి జీవనోపాధిని పొందుతున్నారు.

అధికారుల సహాయంతో...
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లుతున్న దివ్యాంగులకు అధికారులు రుతు రుమాళ్ల తయారీపై శిక్షణ ఇచ్చారు. పత్ర్యేకంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఇందిర క్రాంతి పథం ద్వారా గ్రామీణ బజార్‌ స్వచ్చంద సంస్థ సహాయంతో ముడి సరుకును అందించే ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది.. దివ్యాంగులు చకా చకా.. రుతు రుమాళ్ల తయారిని ప్రారంభించారు. ఎటువంటి రసాయనాలు లేకుండా.. కేవలం పలు రకాల టిష్యు పేపర్లతో వీటిని తయారు చేస్తున్నారు.

పాఠశాల, కళాశాలలకు ఉచిత పంపిణీ...
వైద్యులు పరీక్షించి పూర్తి స్థాయిలో వాడుకునే విధంగా ఉన్నాయని తేల్చిన తర్వాత వీటి తయారీ వేగాన్ని పెంచారు. మొదట తయారు చేసిన 20 వేల రుతు రుమాళ్లను వివిధ పాఠశాలలు, కళాశాలలో ఉచితంగా పంపిణి చేసి వాటి పనితీరును పరిశీలించారు. ఆక్షేపణలు ఏమి లేకుండా మంచి స్పందన రావడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తిరిగి మార్కెటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు.

సైడ్​ ఎఫెక్ట్స్​ లేకుండా...
దివ్యాంగులు చేతులతో తయారు చేయడంలో ఇబ్బందులను పరిశీలించిన కలెక్టర్... ఇంకా సులువుగా, త్వరగా తయారు చేసేందుకు వీలుగా పది లక్షల వ్యయంతో ఆధునాతన యంత్రాలను కొనుగోలు చేశారు. రెండు యంత్రాల ద్వారా ప్రతి పది సెకన్లకు నాలుగు రుతు రుమాళ్లు తయారుచేస్తారు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకపోవడం, బయట రుతు రుమాళ్లతో పోలిస్తే తక్కువ ధరకు లభించడం వల్ల ఆదరణ కూడా బాగుందని చెబుతున్నారు.

మేం ఎవ‌రికీ త‌క్కువ కాద‌ు
పుట్టుక‌తోనో.. ప‌రిస్థితుల ప్రభావం వల్లనో.. అనుకోని సంఘ‌ట‌న‌ల వ‌ల్లనో శారీర‌క‌, మాన‌సిక వైక‌ల్యం ప్రాప్తిస్తుంది. వైక‌ల్యం అనే నిజాన్ని స్వీక‌రించి మాన‌సికంగా సిద్ధమై ఆత్మవిశ్వాసంతోనే ముందుకు వెళితే విజయసాధించవచ్చని నిరూపిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పాలమూరు దివ్యాంగులు.

ఇవీ చూడండి: ఉల్లాసంగా ఉత్సాహంగా... మీ జైల్​ ఎఫ్​.ఎఫ్.​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.