ETV Bharat / state

దేవరకద్రలో ఎమ్మెల్యే పర్యటన... అభివృద్ధి పనులపై ఆరా - ఎమ్మెల్యే వెంకటశ్వర రెడ్డి

దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర్​ రెడ్డి పర్యటించి... పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పట్టణానికి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సులభ్ కాంప్లెక్స్​ను ఏర్పాటు చేయాలని సూచించారు.

mla venkateswara reddy tour in devarakadra
దేవరకద్రలో ఎమ్మెల్యే పర్యటన... అభివృద్ధి పనులపై ఆరా
author img

By

Published : Apr 4, 2021, 11:01 AM IST

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. బస్టాండ్​లో పెట్రోల్ బంకు, వ్యాపార సముదాయాలను, కల్యాణ మండపం, సినిమా థియేటర్​తో పాటు... అవసరమైన చోట సీసీ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

పట్టణానికి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం సులభ్​ కాంప్లెక్స్​ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసులకు సూచించారు. అనంతరం రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి సమీక్షించారు. పనులను మరింత వేగవంతం చేస్తూనే సర్వీస్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మాణం పనులను పరిశీలించారు.

ఇదీ చూడండి: బృహన్‌ ముంబయిలో చిల్లర జీతాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.