రైతుల విజ్ఞప్తిపై ధాన్యానికి మద్దతు ధర పెంచేందుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం కొర్రీలు పెడుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కొత్తకోట, రామన్పాడ్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలోని 7 మండలాల్లో 114 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రైతులకు ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీలు మౌనిక, పద్మావతి, పుర ఛైర్మన్ శుకేశిని, విండో అధ్యక్షులు వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మిర్యాలగూడలో బారులు తీరిన సన్నరకం ధాన్యం ట్రాక్టర్లు