ETV Bharat / state

ఆ మంత్రి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఆల

author img

By

Published : Jul 15, 2020, 3:20 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా అన్నసాగర్​ సమీపంలోని ఎల్లమ్మగుట్టపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​ రెడ్డి మొక్కలు నాటారు. ఇటీవలే మంత్రి నిరంజన్​ రెడ్డి ఇచ్చిన గ్రీన్​ ఛాలెంజ్​ను తాను స్వీకరించినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆల మరో ముగ్గురు జిల్లా అధికారులకు ఛాలెంజ్​ విసిరారు.

mla ala venkateswar reddy green challenge accepted and planted trees in Mahabubnagar
ఆ మంత్రి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఆల

మంత్రి నిరంజన్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్​లో ఉన్న ఎల్లమ్మ గుట్టపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మొక్కలు నాటారు. ఇటీవల కరీంనగర్ పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి మొక్కలు నాటి.. ముగ్గురు ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేయగా దానిని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వీకరించినట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను వందశాతం బతికించుకోవాలన్నారు.

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఎల్లమ్మ గుట్టలో 10 వేల మొక్కలను నాటాలని నిర్ణయం తీసుకొని ఇప్పటికి 2,000 మొక్కలను నాటామన్నారు. వారం రోజుల్లో 10,000 మొక్కలు నాటనున్నట్లు ఎమ్మెల్యే ఆల వెల్లడించారు. గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా జిల్లాలో ఉన్న జడ్పీ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, భూత్పూర్ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డిలకు ఎమ్మెల్యే ఆల ఛాలెంజ్ విసిరారు.

ఇదీ చూడండి: భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.