ETV Bharat / state

MINISTER PRASHANTH REDDY: 'తండ్రి నీటి దొంగైతే... కొడుకు గజదొంగ'

ఏపీ అక్రమ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ కఠినంగా వ్యవహరించనున్నారని మంత్రి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువను ఆపాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రధాని మోదీని అడగనున్నట్లు చెప్పారు. కేంద్రం, కోర్టుల ద్వారా అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని.. అయినా వినకపోతే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు. మహబూబ్​నగర్​లో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​తో ప్రారంభించారు.

MINISTERS
MINISTERS: 'ఏపీ అక్రమ ప్రాజెక్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం'
author img

By

Published : Jun 22, 2021, 4:46 PM IST

పోతిరెడ్డిపాడు నుంచి దొంగతనంగా నీళ్లు తీసుకెళ్లి రాజశేఖర్ రెడ్డి నీటి దొంగైతే, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్టీఎస్ కుడికాలువ పనులతో ఆయన కుమారుడు జగన్ గజదొంగ అయ్యారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దివిటిపల్లిలో 1024 రెండు పడక గదుల ఇళ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర అక్రమ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ కఠినంగా వ్యవహరించనున్నారని తెలిపారు. అనంతరం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బైపాస్ రహదారిని మంత్రులు ప్రారంభించారు.

అడ్డుకునే ప్రయత్నం చేస్తాం..

రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువను ఆపాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రధాని మోదీని అడగనున్నారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా ఏపీ సీఎం జగన్ పనులు కొనసాగిస్తున్నారని ...ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెప్పించుకున్నారు. కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చి గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తామని, అయినా వినకపోతే ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతాం. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రజాయుద్ధానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలి. -ప్రశాంత్​ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి

అన్యాయం జరిగితే ఊరుకోం..

తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని తీరుతామని, జల వనరుల విషయంలో చుక్కనీరు నష్టపోకుండా ఎత్తుకు పైఎత్తు వేస్తామన్నారు. అక్రమ ప్రాజెక్టులను ఎలా అడ్డుకోవాలో ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో పనిచేస్తామని చెప్పారు. జూరాల జలాశయంతో సమానమైన నిల్వ సామర్థ్యమున్న జలాశయాలు మహబూబ్​నగర్ చుట్టుపక్కల పూర్తి అవుతున్నాయని వివరించారు. కర్వెన, ఉదండపూర్ ఇతర జలాశయాలు పూర్తయితే 35టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

దేశంలో అగ్రభాగాన..

అధికారం కోసం కొందరు రాజకీయాలు మాట్లాడుతారని, రాజకీయాలకు అతీతంగా అందరూ తెలంగాణలో ప్రభుత్వ పథకాల లబ్ది పొందుతున్నారు. ప్రాజెక్టులు పూర్తి కాకముందే తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచిందని, పూర్తైతే ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలు అంచనా వేసుకోవాలి. అర్హులైన నిరుపేదలందరికీ రెండు పడక గదులు అందిస్తాం. ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తప్పుడు ధ్రువపత్రాలిచ్చి రెండు పడక గదులు పొందితే వాటిని రద్దు చేస్తాం. -శ్రీనివాస్​ గౌడ్​, పర్యటక శాఖ మంత్రి

'ఏపీ అక్రమ ప్రాజెక్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం'

ఇదీ చదవండి: Cm Kcr: ఏడాదిలోగా బంగారు వాసాలమర్రి కావాలి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.