మహబూబ్ నగర్ డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 9 డీసీసీబీలు, 150కి పైగా పీఏసీఎస్‌లు తెరాస బలపరిచిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చరిత్రగా అభివర్ణించారు. కేసీఆర్ సర్కారు రైతు పక్షపాత సర్కారని చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యమని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా విజయం తెరాసేదేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. సహకార సంఘాల ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకూ సముచిత స్థానం కల్పించారన్నారు. పని చేసే వారికి మంచి అవకాశాలుంటాయని ఈ ఎన్నికలు నిరూపించాయని అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.